: వారం రోజుల్లో రాష్ట్రానికి కొత్త సీఏం: శంకర్రావు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించడం ఖరారైపోయిందని మాజీ మంత్రి పి శంకర్రావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త సీఎంగా ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రానున్నట్టు వెల్లడించారు. అధిష్ఠానం అంటే సీఎంకు గౌరవం లేదని, ముఖ్యమంత్రి స్వంత ఊర్లోనే ఆయనను ఎవరూ గౌరవించరని ఎద్దేవా చేశారు. విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి అంతా స్టేజ్ షో నడిపిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఏప్పుడు ఏది ఎలా సెట్ చేయాలో కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసన్న శంకర్రావు, వారం రోజుల్లో ముఖ్యమంత్రి ప్లగ్ పీకేయడం ఖాయం అని అన్నారు.

  • Loading...

More Telugu News