: ఇలా బిపిని కంట్రోల్ చేయవచ్చు
మీకు బిపి ఉందా... అయితే మీరు వారంలో కనీసం నాలుగు గంటలపాటు వ్యాయామం చేస్తే చక్కగా మీ బిపి అదుపులో ఉంటుంది. ఇది తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారంలో నాలుగు గంటలపాటు వ్యాయామం చేయడం వల్ల 19 శాతం వరకూ బిపిని అదుపులో ఉంచవచ్చని తేలింది.
తీరిక సమయాల్లో శారీరక వ్యాయామం చేయడం వల్ల మీ బిపి లెవెల్స్ చక్కగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. చక్కటి వ్యాయామం మనల్ని చక్కగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్, యూరప్, ఉత్తర ఆసియాల్లో సుమారు 1,36,846 మందిపై నిర్వహించిన అధ్యయనంలో వారంలో ఒకటి లేదా రెండు గంటలపాటు తీరిక సమయాల్లో వ్యాయామం చేసిన వారిలో 11 శాతం బిపి ముప్పు తగ్గినట్టు గమనించారు. ఎక్కువ ఒత్తిడికి గురి కావడం వల్ల పలు రకాలైన గుండెకు సంబంధించిన జబ్బులు రావడంతోబాటు కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. ఒత్తిడిని నివారించడానికి, అలాగే రక్తపోటును అదుపులో ఉంచడానికి, తీరిక సమయాల్లో చక్కగా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.