: గంటసేపు చాలు...


రోజూ ఒక గంటసేపు చాలు... చక్కగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. ఇంతకూ ఆ గంటసేపు ఏం చేయాలనేగా... వాకింగ్‌. చక్కగా నడిస్తే చాలు మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రతిరోజూ ఒక గంటపాటు చక్కగా నడవడం వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.

ద అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో సుమారు 73,615 మంది మెనోపాజ్‌ దశ దాటిన మహిళలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో రోజూ ఒక గంటపాటు నడిచే అలవాటున్న మహిళలకు 14 శాతం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గినట్టు తేలింది. ఈ మహిళల్లో 47 శాతం మంది రోజూ గంటపాటు నడవడం తమకు చాలా సంతోషాన్నిస్తోందని చెప్పారట. ఇలా వారానికి ఏడు గంటలపాటు నడిచిన మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు 14 శాతం దాకా తగ్గినట్టు అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అలాగే కష్టపడి పనిచేసే మహిళల్లో బ్రెస్ట్‌క్యాన్సర్‌ ముప్పు 25 శాతం దాకా తగ్గినట్టు ఈ అధ్యయనంలో తేలింది. మొత్తంగా మహిళల్లో ముఖ్యంగా కష్టపడి పనిచేసేవారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు మరింత తక్కువగా ఉంటుందని అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News