: దోమలను ఇలా దూరం చేద్దామా


ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే వాటి బెడద తగ్గించుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ దోమలు ఉంటే మనం సాధారణంగా కాయిల్స్‌, లేదా రిఫెల్లెంట్లను ఉపయోగిస్తుంటాం. ఇలాంటి వాటి వల్ల ఎక్కువమందికి అలర్జీలు వంటివి వస్తుంటాయి. ఇలాంటి సమస్యలున్నవారు సహజసిద్ధమైన కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే దోమలను తరిమికొట్టవచ్చు.

దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పాత్రలో టీ పొడివేసి దాన్ని కాల్చితే ఆ ఘాటుకు దోమలు పరార్‌, అలాగే ఒక పాత్రలో పుదీనా మొక్కను పెంచి దాన్ని ఇంట్లో పెట్టుకున్నా పుదీనా వాసనకు దోమలు రావు. ఒక గ్లాసులో సగానికి నీళ్లు పోసి అందులో అరడజను కర్పూరం బిళ్లలు వేసి ఉంచితే వాటి వాసనకు దోమలు పారిపోతాయి. ఇంకా ఇప్పుడు దోమలను దూరం చేసే ప్రత్యేకమైన అగరుబత్తీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని కూడా చక్కగా వాడుకోవచ్చు. ఒకవేళ దోమలు కుట్టినా ఆ చోట నొప్పి, దురద ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో వెనిగర్‌లో ముంచిన దూదితో రుద్దితే చక్కటి ఉపశమనం లభిస్తుంది.

  • Loading...

More Telugu News