: గుంటూరు డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఈ ఉదయం నిర్వహించిన పోలింగులో డీసీసీబీలో టీడీపీ 16 స్థానాలను కైవసం చేసుకొని జయకేతనాన్ని ఎగురవేసింది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలనే దక్కించుకుంది. అభ్యర్థులు లేకపోవడంతో మిగతా 3 స్థానాలు ఖాళీగానే ఉండిపోయాయి.
అలాగే, అటు జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గాన్ని కూడా టీడీపీనే చేజిక్కించుకుంది. మొత్తం 10 డైరక్టర్ల స్థానాలకు గానూ టీడీపీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ 1, కాంగ్రెస్ 1, స్వతంత్ర అభ్యర్ధులు ఒకటి చొప్పున పంచుకున్నారు. మరో రెండు చోట్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెసే టీడీపీకి మద్దతివ్వడంతో పాలకవర్గాన్నితెలుగుదేశం సొంతం చేసుకుంది. విశేషమేమిటంటే, సహకా