: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన లగడపాటి


విభజనపై కేంద్రమంత్రి మండలి తీసుకున్న నిర్ణయంపై ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. రెండుసార్లు యూపీఏను గెలిపించి, అధికారం కట్టబెట్టిన తెలుగు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? అని ప్రశ్నించారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ ను బలోపేతం చేసినందుకు ఇలాగేనా చేసేది? అనడిగారు. కాంగ్రెస్ తీరుపట్ల ప్రజలు తీవ్ర వేదనతో రగిలిపోతున్నారన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు. ఏ పార్టీకి ఇవ్వని సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చారన్న ఆయన, పరాయివారి అండదండలు చూసుకుని కాంగ్రెస్ ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు పక్షపాతంతో హస్తం పార్టీ ఇలా వ్యవహరిస్తోందని వాపోయిన లగడపాటి, ఇష్టానుసారం చేయడానికి ఇది రాచరికం కాదని మండిపడ్డారు. హైదరాబాదులోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన లగడపాటి సొంత పార్టీపై నిప్పులు చెరిగారు. పార్టీలు చెప్పాయి కదా అని విభజిస్తే ఈ సూత్రం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందా? అని సూటి ప్రశ్న వేశారు. ఇప్పటికే సీమాంధ్రలోని 15 మంది ఎంపీలు రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News