: సీఎం చెప్పిన ఆఖరి బంతి కూడా అయిపోయింది : వీహెచ్
ముఖ్యమంత్రి చెప్పిన లాస్ట్ బాల్ కూడా అయిపోయిందని సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. అందుచేత సీఎం ఇకపై ప్రజలెవరినీ ఇబ్బంది పెట్టరాదని విన్నవించారు. అభివృద్ధి చెందేందుకు సీమాంధ్రలో ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఎవరూ బాధపడరాదని... సీమాంధ్రులు కూడా లాభపడాలనేదే తమ ఆలోచన అని వీహెచ్ అన్నారు. అధిష్ఠానం అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుందని... ఇక ఎవరూ ఆటంకాలు కలిగించరాదని కోరారు.