: తెలంగాణ మహిళా జేఏసీ ఏర్పాటు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన రాజకీయ ఐకాసలో భాగంగా మహిళా జేఏసీని ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యమంలో మహిళల పాత్ర కూడా మరింత విస్తరిస్తుందని భావిస్తున్నారు. ఈరోజు మొత్తం 29 మందితో మహిళా జేఏసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు.