: తండ్రీ కొడుకుల ముసుగులో విభజన వాదులు: రాజేంద్రప్రసాద్
చీమలు పెట్టిన పుట్టలోకి పాములా జగన్ సమైక్యాంధ్ర ఉద్యమంలోకి చొరబడ్డారని టీడీపీ నేత యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ సమైక్యముసుగులోని విభజన వాదులని ఆయన మండిపడ్డారు. 1999 లోనే తెలంగాణ ఏర్పాటుకు బీజం వేసింది వైఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయంపై తాము దీక్ష తలపెట్టాలని యోచిస్తే జగన్ దాన్ని హైజాక్ చేశాడని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.