: హైదరాబాదు ఇమ్లీబన్ బస్టాండు వద్ద బాంబు కలకలం


హైదరాబాదులో రోజూ ఏదో ఒకచోట బాంబు ఉందన్న సమాచారం పోలీసులను, ప్రజలను, పరుగులు పెట్టిస్తోంది. తాజాగా కొద్దిసేపటి కిందట నగరంలో ఇమ్లీబన్ బస్టాండు వద్ద బాంబు ఉందన్నవార్త కలకలం రేపింది. వెంటనే అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ జాగిలాలతో అణువణువు తనిఖీలు చేయిస్తున్నారు. తనిఖీల్లో ఎంజీ బస్  ప్రాంగణంలోని గార్డెన్ లో జిలెటిన్ స్టిక్స్ ఉన్నఓ సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బాంబు ఉందని తెలియడంతో ప్రయాణికులు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News