: 2014 ఎన్నికలు చావో రేవో కాదు: రాహుల్ గాంధీ


రానున్న 2014 ఎన్నికలు కాంగ్రెస్ కు చావో రేవో పరిస్థితి కాదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బలహీనతల్ని అధిగమించి విజయాల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. అనంతరం సమావేశ వివరాలను జామ్ నగర్ కు చెందిన పార్టీ ఎంపీ విక్రమ్ మదామ్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాహుల్ చెప్పారన్నారు.

  • Loading...

More Telugu News