: తీవ్రవాదులు స్వర్గం నుంచి రావట్లేదని పాకిస్థాన్ కు చెప్పా : రాష్ట్రపతి ప్రణబ్


మేము శాంతిని కోరుకుంటున్నామని... అదే సమయంలో దేశ భద్రతపై రాజీ పడే సమస్యే లేదని పాకిస్థాన్ కు స్పష్టం చేసినట్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. పొరుగుదేశం అండతో అరాచకాలకు పాల్పడుతున్న తీవ్రవాదులను సహించమని అన్నారు. నాలుగు రోజుల బెల్జియం టూర్ లో ఉన్న రాష్ట్రపతి అక్కడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఉగ్రవాదుల దాడులు ఎప్పుడు జరిగినా తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటుందని ఆయన విమర్శించారు. అందుకే, 'తీవ్రవాదులు మీ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి కాకుండా స్వర్గం నుంచి వస్తున్నారా?' అని పాక్ ను ప్రశ్నించానని అన్నారు.

ఎక్కడైనా సరే తీవ్రవాద కార్యకలాపాలను నిర్మూలించాల్సిందేనని రాష్ట్రపతి అన్నారు. పాక్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని తీవ్రంగా హెచ్చరించారు. తమ భూభాగంలో ఉన్న తీవ్రవాద తండాలను నాశనం చేయాలని పాక్ కు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిందని విమర్శించారు. 2004లో భారత్ కు హాని కలిగించే శక్తులకు తమ భూభాగంపై స్థానం లేకుండా చేస్తామని పాక్ హామీ ఇచ్చిందని... కానీ, దాన్ని నిలబెట్టుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడంలేదని ప్రణబ్ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News