: సీఎంతో ముగిసిన మంత్రుల భేటీ


క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ తో రాష్ట్ర మంత్రుల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేవరకు రాజీనామాలు చేయరాదని సీఎం చెప్పారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు ఇంతవరకు లేవని తెలిపారు. కాబట్టి రాష్ట్ర విభజనకు సంబంధించినంత వరకు అసెంబ్లీలో కచ్చితంగా తీర్మానం చేయాల్సిందేనని చెప్పారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడితే దాన్ని ఓడిస్తామని గంటా అన్నారు. అంతే కాకుండా భవిష్యత్ కార్యాచరణకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News