: 'వార్టన్ భారతీయ ఆర్ధిక సదస్సు'లో నరేంద్ర మోడీ ప్రసంగం
ప్రతిష్ఠాత్మక 'వార్టన్ భారతీయ ఆర్ధిక సదస్సు'లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఈ నెలలో ఫిలడెల్ఫియాలో నిర్వహించే సదస్సులో ప్రసంగించే ప్రముఖులలో ఆయన ఒకరు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఇండియా నుంచే ఉపన్యాసాన్ని ఇస్తా
సదస్సుకు అతిధులుగా.. ఐటీ, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి మిలింద్ డియోరా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, నటి షబానీ అజ్మీ, రచయిత జావేద్ అక్తర్ హాజరవుతున్నారు. 'భారతదేశం- వ్యాపారంపై దృష్టి' అంశం నేపథ్యంలో 16 సంవత్సరాల క్రితం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఇండియాలో వ్యాపారానికి ఉన్న అవకాశాలు, సవాళ్లపై పలువురు నాయకులు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తోంది.
కాగా, గతంలో
ఈ సదస్సులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మంత్రి చిదంబరం, బీజేపీ
నేత వరుణ్ గాంధీ, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ప్రసంగించారు.