: కేసీఆర్.. తీరు మార్చుకో: నాగం
తెలంగాణ వాదులను కలుపుకుని పోవడంలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సరిగా వ్యవహరించడం లేదని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని హస్తినాపురానికి చెందిన ఓ తెరాస నాయకుడిని కేసీఆర్ సస్పెండ్ చేయడాన్ని నాగం తప్పుబట్టారు.
తెలంగాణ రాజకీయ ఐకాస నీరుగారిపోవడానికి కేసీఆరే కారణమని నాగం ఆరోపిస్తున్నారు. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఎన్డీఏతో జతకడతామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కష్టించి పనిచేసే వారికే సీట్లు ఇస్తామని నాగం చెప్పారు.