: ఎంపీ రాయపాటి రాజకీయాలకు గుడ్ బై
తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ గత 60 రోజులుగా ప్రజలు ఉద్యమ బాటపట్టినా కేంద్రం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం చాలా మూర్ఖంగా నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. పది సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించటం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. గత రెండు పర్యాయాలు ప్రజలు తమను గెలిపించినా అదే వారిపాలిట శాపంగా మారిందని, అందుకే తాను రాజకీయాలనుంచి వైదొలగుతున్నానని ఆయన ప్రకటించారు.