: దివాకర్ ట్రావెల్స్ కు సమైక్య సెగ
దివాకర్ ట్రావెల్స్ కు సమైక్య సెగ తగిలింది. చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం ఆరోగ్యవరం వద్ద హైదరాబాద్ నుంచి మదనపల్లి వైపుకు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులను సమైక్యవాదులు అడ్డుకున్నారు. డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించడంతో సమైక్యవాదులు బస్సు టైర్లలో గాలి తీసివేసి, అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో పాటు పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై సమైక్యవాదులు రాళ్లు రువ్వి ధ్వంసానికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి పట్టణంలోకి వాహనాలు రాకుండా అడ్డుకున్నారు.