: విభజించమన్న జగన్ దీక్ష ఎలా చేస్తారు: మోత్కుపల్లి
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని చెప్పిన వైఎస్ జగన్ ఇప్పుడు దీక్ష ఎలా చేస్తారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సూటిగా ప్రశ్నించారు. దొంగ దీక్షలు చేసి ప్రజలను మోసగించొద్దని మండిపడ్డారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, తెలంగాణ ఏర్పాటుకు అందరూ సహకరించాలని మోత్కుపల్లి కోరారు. వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి.. రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోత్కుపల్లి, ఎర్రెబెల్లి, ఇతర నేతలతో కలిసి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విభజన విషయంలో సమస్యలున్నాయని, రెండు ప్రాంతాల జేఏసీలను కేంద్రం పిలిచి మాట్లాడితే తప్పేంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు.