: డైనోసార్లతో పోరాడిన జాతి... ఇప్పటికీ మన మధ్యే ఉంది!


డైనోసార్..ఈ పేరు వినగానే రాక్షస బల్లులు మన కళ్ల ముందు కదలాడుతాయి. ఈ భూమిపై కోట్ల సంవత్సరాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ రాకాసి జీవరాశి నశించిపోయి చాలా కాలమయింది. అయితే తాజాగా డైనోసార్ల గురించి ఓ ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. 

డైనోసార్లు.. ఆకారంలో, బలంలో సాటిలేనివి. అంతేకాదు, భీకరమైనవి కూడా. అలాంటి ఈ జాతితో పోరాడిన మరోజాతిని ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనోసార్లతో పోరాడిన ఆ జాతి ఇప్పుడు కూడా మన మధ్యలోనే ఉంది. ఇంతకీ ఏమిటా ప్రాణి అనుకుంటున్నారా? అదేనండి..మొసలి! ఏడున్నర కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లతో మొసళ్లు పోరాడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

తాజాగా జరిపిన తవ్వకాల్లో డైనోసార్ల ఎముకలపై 2.5 మిల్లీ మీటర్ల వెడల్పున పంటి గాయాలున్నట్లు గుర్తించామని దక్షిణ డకోటా స్కూల్ ఆఫ్ మైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త క్లింట్ బోయ్డ్ తెలిపారు. ఇవి మొసళ్ల పంటిగాయాలే అని శాస్తవేత్తలు నిర్థారిస్తున్నారు. అయితే డైనోసార్లలో హిప్సిలోఫోండొంటిడ్ జాతికి చెందిన కుర్ర డైనోసార్లపైనే మొసళ్లు దాడి చేసేవని ఇప్పటి వరకు గుర్తించినట్లు బోయ్డ్ తెలిపారు.

  • Loading...

More Telugu News