: స్పీకర్ ఇంటి ముట్టడికి తెదేపా యత్నం
గుంటూరు జిల్లా తెనాలిలోని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే అప్పటికే స్పీకర్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు... తెదేపా శ్రేణుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.