: బంద్ తో బోసిపోయిన ఇంద్రకీలాద్రి


సీమాంధ్ర బంద్ ప్రభావంతో ఇంద్రకీలాద్రి బోసిపోయింది. భక్తుల రద్దీ సగానికి సగం పడిపోయింది. రేపట్నుంచి ఇక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఆలయ అధికారులు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. ఈ రోజు శుక్రవారమైనప్పటికీ భక్తుల రాక తగ్గిపోవడంతో కొండ మీద ఒకలాంటి స్థబ్దత ఏర్పడింది.

సీమాంధ్రలో 48 గంటలపాటు బంద్ కు పిలుపునివ్వడంతో... అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు రవాణా సదుపాయాలు కూడా లేకుండాపోయాయి. ఒక బెజవాడ కనకదుర్గమ్మ ఆలయమే కాకుండా సీమాంధ్రలోని అన్ని దేవాలయాలపై బంద్ ప్రభావం కనపడుతోంది.

  • Loading...

More Telugu News