: కాశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదుల హతం


కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో అక్రమ చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు తీవ్రవాదులను ఆర్మీ దళాలు కాల్చి చంపాయి. కెరన్ సెక్టర్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత ఆర్మీ కాల్పులు జరిపింది. గత 10 రోజుల నుంచి దాదాపు 40 మంది చొరబాటుదారులు కెరన్ సెక్టర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించగా వారిలో 15 మందిని భద్రతాదళాలు కాల్చి చంపాయి. అధికారులు మరిన్ని చొరబాట్లు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News