: స్పీకర్ నివాసం ముట్టడికి యత్నం
కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో... సమైక్య సెగ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు తగిలింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ... గుంటూరులోని స్పీకర్ నివాసాన్ని ముట్టడించేందుకు సమైక్యవాదులు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పీకర్ నివాసం వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.