: మంత్రి కన్నా ఇంటి ముట్టడికి యత్నం
గుంటూరులోని మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఇంటి ముట్టడికి సమైక్యవాదులు యత్నించారు. భారీ సంఖ్యలో కన్నా ఇంటి వద్దకు చేరుకున్న సమైక్యవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దీంతో పాటు, నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.