: విభజన తర్వాత నక్సల్స్ సమస్య తలెత్తదు: షిండే
రాష్ట్ర విభజన తర్వాత నక్సల్స్ సమస్య తలెత్తదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ధీమా వ్యక్తం చేశారు. నక్సల్స్ సమస్యను గతంలో ఏపీ సమర్ధవంతంగా పరిష్కరించిందని, విభజన జరిగినా సమస్యను ఎదుర్కొంటారన్నారు. మంత్రులు, ఎంపీలు రాజీనామాలపై ఈ సందర్భంగా మాట్లాడిన షిండే, విభజన సమయంలో ఇలాంటివన్నీ సహజమేనన్నారు. కాగా, విభజన నేపథ్యంలో సీమాంధ్రులలో తలెత్తిన సమస్యలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని షిండే తెలిపారు.