: బాబ్లీ అంశంపై తెలంగాణ జిల్లాల్లో టీడీపీ నిరసన కార్యక్రమం
బాబ్లీ ప్రాజెక్టు అంశంపై తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఆందోళన నిర్వహించనున్నట్లు టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 7న నిజామాబాద్, 8న ఆదిలాబాద్, కరీంనగర్, 9న నల్గొండ, వరంగల్ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ వేయాల్సిందేనని మండవ డిమాండు చేశారు.