: అప్రమత్తమైన రైల్వే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడంతో... సీమాంధ్ర భగ్గుమంది. సమైక్యవాదులు ఆందోళనలను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సీమాంధ్ర జిల్లాల్లో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లతోపాటు రైళ్లలో భద్రతను పెంచారు. అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలతో గస్తీని ముమ్మరం చేశారు.