: అట్టుడుకుతున్న సీమాంధ్ర


కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అనంతపురం జిల్లాలో సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు తెల్లవారుజామునే రోడ్లపైకి చేరుకుని బంద్ ను పాటిస్తున్నారు. ఉరవకొండలో జాతీయ రహదారిని దిగ్బంధించి రాకపోకలను అడ్డుకున్నారు. హిందూపురంలో సమైక్యవాదులు సబ్ స్టేషన్ ను ముట్టడించారు. గుంతకల్, కదిరి, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు ఇతర పట్టణాల్లో బంద్ కొనసాగుతోంది.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కావలిలో టైర్లు తగులబెట్టి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. గూడూరులో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. నాయుడుపేటలో తపాలా కార్యాలయం బోర్డు, పోస్టు బాక్సులను తగులబెట్టి నిరసన తెలిపారు.

విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, బోర్డులు చించివేసి తగలబెడుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఏపీఎన్జీవోలు, సమైక్యవాదులు రహదారులను దిగ్బంధించి వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News