: నేడు టాటా గ్రూప్ సీఈఓలను ఉద్దేశించి జేపీ ప్రసంగం
లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ టాటా గ్రూప్ సీఈఓలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముంబయిలో ఈ రోజు జరిగే 'టాటా ఎధిక్స్ సదస్సు -2013' లో విలువలతో కూడిన నాయకత్వం అంశంపై ఆయన ప్రసంగిస్తారు. రేపు రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లా కపర్డ లోని ఆరావళి గురుకుల ఆశ్రమంలో జరిగే సదస్సులో '21వ శతాబ్దంలో 19వ శతాబ్దపు రాజకీయాలు' అంశంపై ఆయన ప్రసంగించనున్నట్టు లోక్ సత్తా వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.