: ఆయాసం తగ్గాలంటే...


కొందరికి ఆయాసం ఉంటుంది. ఆయాసం ఉన్నవారు కొన్ని రకాలైన ఆహార పదార్ధాలను తినకుండా ఉంటే మేలేనట. వాటిలో ముఖ్యంగా ఐస్‌క్రీంలు, బెండకాయ, చేమదుంపలు, పెరుగు, కొబ్బరి, సొరకాయ, బచ్చలి కూర వంటివాటితోబాటు ఎక్కువగా పుల్లటి పదార్ధాలకు దూరంగా ఉంటేనే మేలట. అలాగే ఇలాంటి వారు తినదగిన పదార్ధాలు ఏవంటే... ముల్లంగి, గోధుమలు, తేనె, వెల్లుల్లి చక్కగా వాడుకోవచ్చు. ప్రతి ఉదయం, సాయంత్రం చిటికెడు పసుపు, ఒక చిటికెడు మెత్తని ఉప్పు రెండు చిటికెల పిప్పళ్ల చూర్ణం కలిపి తిని వేడి నీళ్లు తాగితే ఉబ్బసానికి చక్కటి ఉపశమనం పొందచ్చు. అంతేకాదు, దీనివల్ల క్రమంగా ఎలర్జీలు కూడా తగ్గుతాయట!

ఇంకా ఉసిరికాయ పెచ్చులు, వరిపేలాలు, పటికబెల్లం, నువ్వుపప్పు, నెయ్యి కూడా సమభాగాలుగా తీసుకుని వాటిని చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుందట. వేడి వేడి టీ డికాషన్‌లో తొమ్మిది చుక్కల నిమ్మరసాన్ని వేసుకుని తేనె కూడా కలుపుకుని వేడి వేడిగా తాగితే కూడా ఉబ్బసం తగ్గుముఖం పడుతుందట. ఆయాసం వున్నా వాళ్ళు ఈ చిట్కా వైద్యాన్ని ట్రై చేయచ్చు!

  • Loading...

More Telugu News