: జలుబు వైరస్‌తో క్షయ వ్యాధికి చెక్‌ చెప్పవచ్చు


ప్రాణాంతక క్షయ వ్యాధిని నివారించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ఔషధాన్ని కనుగొనడంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక సరికొత్త టీకాతో క్షయ వ్యాధిని నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టీకా క్షయవ్యాధి కారక బ్యాక్టీరియాతో పోరాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కెనడాలోని మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రాణాంతక క్షయ వ్యాధితో పోరాడే కొత్త తరహా టీకాను అభివృద్ధి చేశారు. ఈ కొత్త బూస్టర్‌ టీకాను జన్యుపరంగా తీర్చిదిద్దిన జలుబు వైరస్‌ ఆధారంగా తయారుచేశారు. ఈ టీకా బీసీజీకి బూస్టర్‌లాగా పనిచేస్తుందని, టీబీ వ్యాధికి ఈ తరహా టీకాను తొలిసారిగా తాము రూపొందించినట్టు మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్‌ ఫియోనా స్మెయిల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News