: వేలానికి టిప్పు కత్తి!


టిప్పు సుల్తాన్‌... మైసూర్‌ పులిగా అందరికీ గుర్తుండే టిప్పు వాడిన కత్తి గురించి అందరం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఇలాంటి కత్తి ఇప్పుడు వేలానికి రాబోతోంది. ఒక్క టిప్పు కత్తేకాదు... మొగల్‌ చక్రవర్తుల ఆభరణాలు, దక్కన్‌ రాజుల కాలంనాటి అరుదైన చిత్రపటాలు, పింగాణీ పాత్రలు ఇలా బోలెడు వస్తువులు వేలానికి రాబోతున్నాయి.

సుమారు 500 ఏళ్లనాటికి చెందిన 90 రకాల వస్తువులను 'భారత సామ్రాజ్య కళా సంపద' పేరుతో వేలం వేయబోతున్నారు. ఈ వేలాన్ని ఇప్పటి వరకూ ఎక్కడా ఎప్పుడూ నిర్వహించని రీతిలో నిర్వహించడానికి ఈనెల 9న లండన్‌లో అత్యంత భారీగా ఈ వేలానికి సోత్‌బే సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేలం గురించి సంస్థ డైరెక్టర్‌ బెనెడిక్ట్‌ కార్టర్‌ మాట్లాడుతూ అరుదైన, అందమైన, నాణ్యమైన కళా సంపదను వేలానికి సిద్ధం చేశామని, ప్రదర్శనలోని వస్తువులు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని, అంతర్జాతీయంగా ప్రజలకు వీటిపై చాలా ఆసక్తి ఉందని అంటున్నారు.

  • Loading...

More Telugu News