: శాకాహారుల్లోనే ఈ బాక్టీరియా ఎక్కువట
శాకాహారుల్లో ఎక్కువగా ఉండే ఒక కొత్తరకం బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది శాకాహారాన్ని తీసుకునే మనుషుల పేగుల్లో ఎక్కువగా ఉంటున్నట్టు, పీచు పదార్ధం జీర్ణం కావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
సహజంగా మానవ శరీరంలో పలు రకాలైన బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే వీటన్నిటికన్నా కూడా ఈ బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించారు. మెలైనా బ్యాక్టీరియా అనే పేరుగల ఈ బ్యాక్టీరియా భూగర్భ జలాల్లోనూ, క్షీరదాల పేగుల్లోను అందునా ముఖ్యంగా శాకాహారులైన క్షీరదాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి విటమిన్ బి, విటమిన్ కెల సంశ్లేషణలో పాలుపంచుకుంటాయి. ఈ బ్యాక్టీరియా పేగుల్లోని ఆహారం పులిసే ప్రక్రియకు చక్కగా తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇది హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేసి శాకాహారంలోని పీచు పదార్ధం జీర్ణం కావడానికి ఉపయోగపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే పేగుల్లో హైడ్రోజన్ పోగుపడినప్పుడు ఇది పులిసే ప్రక్రియను ఆపేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.