: తెలంగాణలో అంబరాన్నంటిన సంబరాలు


తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ నోట్‌ను గురువారం సాయంత్రం కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో తెలంగాణవాదులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఉరిమే ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఎంతోమంది త్యాగధనుల పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని.. ఉద్యమవీరులకు, విద్యార్థులకు జేజేలు పలికారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేటీఆర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

మంత్రి జానా రెడ్డి నివాసంలో మంత్రులు సుదర్శన్ రెడ్డి, సారయ్య, ఇతర నాయకులు బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మిఠాయిలు తినిపించుకున్నారు. గన్ పార్క్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర, ఇతర నాయకులు తెలంగాణ నినాదాలు చేశారు. జేఏసీ, విద్యార్థి జేఏసీ, బీజేపీ, టీఆర్‌ఎస్, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ తెలంగాణా నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News