: రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి: చంద్రబాబు
రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోరారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంతో ప్రజలకు రాజకీయ పక్షాలపై నమ్మకం పోయిందని చంద్రబాబు అన్నారు. 60రోజులుగా సీమాంధ్రలో ప్రజలు ఆందోళన చేస్తున్నా వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తో వైఎస్సార్సీపీ ఒప్పందం వల్లనే జగన్ కు బెయిల్ వచ్చిందని ఆయన తెలిపారు. తెలుగుజాతి మధ్య విద్వేషాలు పెంచడం మంచిది కాదని ఆయన కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. రెండు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియాను ఒక్క మాట అనకుండా జగన్ తనను విమర్శించడమేంటని ప్రశ్నించారు.