: ఇది కీలక ఘట్టమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్
విభజన నోట్ ముందుకెళ్లడానికి సహకరించిన వారందరికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన సమయంలో ఇది కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. ఇదే ధృడసంకల్పంతో కేంద్రం ముందు కెళ్ళాలని ఆయన కోరారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారందరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. విద్వేషాలతో కాకుండా పరస్పరం సామరస్యంగా విడిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.