: జువైనల్ హోం నుంచి 35 మంది బాలనేరస్థుల పరారీ
మధ్యప్రదేశ్ లోని రేవాలో బాలనేరస్థుల సంక్షేమ గృహం నుంచి 35 మంది పరారయ్యారు. రాత్రి ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై కొద్ది గంటల్లోనే 10 మందిని పట్టుకోగలిగారు. మిగిలిన వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ సంక్షేమ గృహానికి ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డు ఉండటంతో... అతన్ని తోసేసి వారు పరారయ్యారు. మిగిలిన బాల నేరస్థుల కోసం గాలిస్తున్నారు.