: విభజనను సమర్ధిస్తే, రాజకీయ జీవితానికి శుభం పలికినట్టే: అశోక్ బాబు
క్యాబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందని తెలిసీ కేంద్ర మంత్రులు, ఎంపీలు నోరు తెరవకపోవడం బాధాకరమని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. నోట్ క్యాబినెట్ కు వస్తే రాజీనామా చేయకపోతే జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను సమర్ధించే ప్రతి ప్రజాప్రతినిధి రాజకీయ జీవితానికి శుభం కార్డు వేస్తామని ఆయన తెలిపారు. మంత్రులు పదవులకోసం రాష్ట్ర విభజనకు సహకరిస్తే వూరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కేంద్రం అయోమయంలో ఉందని, రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులపై యుద్ధం ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను విడదీయవద్దని అందరు నేతలను కోరుతున్నామని సూచించారు. సీమాంధ్ర ఎంపీలంతా పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాల్సిందేనని అశోక్ బాబు డిమాండ్ చేశారు.