: మనీలాండరింగ్ కేసులో మధుకోడాకు బెయిల్
మనీలాండరింగ్ కు సంబంధించిన ఒక కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. రూ.2500 కోట్ల నగదు బదిలీ, అక్రమ పెట్టుబడుల స్కాం వ్యవహారంలో కోడాకు సంబంధం ఉందని ఆదాయపు పన్నుశాఖ, ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేటు (ఈడీ) అధికారులు చేసిన దాడుల్లో నిరూపించారు. దీంతో 2009, నవంబర్ 30న మధు కోడాను అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేశారు.
దీనిపై ఈడీ అధికారి ఒకరు మాట్లాడుతూ, కోడా సీఎంగా ఉన్న సమయంలో 2006, 2008 సంవత్సరాల మధ్య అక్రమ పెట్టుబడుల అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడది రూ.3,400 కోట్లకు పెరిగిందని దర్యాప్తులో వెల్లడైందన్నారు. కాగా, ఈ కేసు మొదట్లోనే కోడాకు చెందిన రూ.200 కోట్ల విలువచేసే స్థిరచరాస్థులను ఈడీ అటాచ్ చేసుకుంది. అంతేగాక, ఈ వ్యవహారంపై 2012లో రాంచీ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ ను కూడా నమోదు చేసింది. కోడా ప్రస్తుతం రాంచీ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.