: కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని భావించాం: రబ్రీదేవి


ఆర్జేడీ అధినేత లాలూకు దాణా కుంభకోణం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించడంపై భార్య రబ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని భావించామని అయితే, తీర్పు తమను తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ కుట్రలో లాలూ బాధితుడయ్యారని అన్నారు. ఈ విషయంలో తాము మౌనంగా ఉండమని, ప్రజల వద్దకు వెళ్లి అన్ని విషయాలను తెలుపుతామనీ అన్నారు. ఇక నుంచి పార్టీని తానే నడుపుతానని రబ్రీదేవి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News