: తీర్మానాన్ని అడ్డుకుంటాం : బొత్స
తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర ప్రాంత నేతల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందనేది కేవలం మీడియా కల్పన మాత్రమేనని బొత్స అన్నారు.