: రక్తమోడిన పాక్.. ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి
పాకిస్థాన్ లోని పెషావర్ రక్తమోడింది. పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది స్థానికులు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. పాకిస్థానీ తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నబీ హన్ఫీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. కాగా, ఈ దాడి నుంచి హన్ఫీ క్షేమంగా బయటపడిందీ, లేనిదీ తెలియలేదు.