: సమైక్యవాదులందరికీ మా మద్దతు ఉంటుంది: సచివాలయ జేఏసీ
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు సచివాలయంలోని సి బ్లాక్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా సమైక్యవాదం వినిపించేవారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. తాము రాజకీయాల గురించి ఆలోచించడం లేదని, తమ లక్ష్యం సమైక్యవాదమని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు.