: నిమ్మగడ్డ బెయిల్ పై తీర్పు వాయిదా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి తీర్పును ఈనెల 7కు వాయిదా వేశారు. నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాన్ పిక్ కేసులో ప్రధాన పాత్ర పోషించిన వీరిరువురు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే, బెయిల్ అడ్డుకోవడానికే సీబీఐ ఊహాజనిత వాదనలు వినిపిస్తోందని నిమ్మగడ్డ తరపు న్యాయవాది అన్నారు.
అటు వీరిద్దరికీ జగన్ కేసులో ఈ నెల 17 వరకు సీబీఐ కోర్టు రిమాండును పొడిగించింది. ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డికి కూడా అదే తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇక ఓఎంసీ కేసులో గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి పదిహేడవ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.