: కిశోర్ చంద్రదేవ్ కు మాతృ వియోగం
కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర దేవ్ మాతృమూర్తి శోభలతాదేవి (85) ఈ రోజు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా భువనేశ్వర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ మధ్యాహ్నం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో కిశోర్ చంద్రదేవ్ తల్లి వద్దే ఉన్నారు.