: కేంద్ర హోం మంత్రి షిండేతో చిరంజీవి భేటీ
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సమావేశం అయ్యారు. ఈ భేటీలో విదేశీ పర్యాటకులకు ఆన్-అరైవల్ వీసా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఆన్-అరైవల్ వీసా సౌకర్యం కల్పించడంతో పాటు..అలాగే ప్రస్తుతం 13 దేశాల పర్యాటకులకు అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని మరో 17 దేశాల పర్యాటకులకు అందించాలనే విషయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు.