: కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం చేయబోతున్నారో స్పష్టం చేయాలి : అశోక్ బాబు


కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్ ను ఆమోదిస్తే... ఆ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం చేయబోతారో స్పష్టం చేయాలని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి బయటకొస్తారా? లేక హైకమాండ్ ను అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఏపీఎన్జీవో భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే... తెలంగాణ ముసాయిదాను కేంద్ర కేబినేట్ ఆమోదించే అవకాశాలు కనపడుతున్నాయని అన్నారు. దీని తర్వాత ఇది తీర్మానం కోసం మన అసెంబ్లీకి వస్తుందని తెలిపారు. అన్ని స్టేజీలు దాటి అసెంబ్లీకి వచ్చిన తర్వాత.. ఇక్కడున్న ఎమ్మెల్యేలంతా దాన్ని వ్యతిరేకించేలా చూస్తామని అశోక్ బాబు తెలిపారు. లేకపోతే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని, బిల్లును అడ్డుకుంటామని... సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు ప్రమాణం చేయాలని అన్నారు. రేపు, ఎల్లుండి చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News