: ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న చైనా


అంతరిక్ష రంగంలో చైనా దూసుకుపోతోంది. రోదసిలో ఓ స్పేస్ మిషన్ ఏర్పాటు చేసే లక్ష్యంతో చైనా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. ఈ వేసవిలో షెంజౌ-10 వ్యోమనౌక ద్వారా వీరు అంతరిక్షంలోకి  అడుగుపెడతారు. అమెరికా, రష్యాలకు దీటుగా ఖగోళ పరిశోధనలు చేసేందుకు వీలుగా తగిన పరిజ్ఞానం సముపార్జించాలన్నదే చైనా లక్ష్యం. 

ఈ క్రమంలో అంతరిక్ష పరిశోధనాలయ నిర్మాణం, వివిధ విభాగాల అనుసంధానం వంటి కీలక ప్రక్రియలను స్వీయ సాంకేతికతతో సాధించాలన్న లక్ష్యంలో భాగంగా చైనా తియాన్ గాంగ్ పేరిట తాజా ప్రయోగానికి నడుంబిగించింది. ప్రస్తుతం ఇలాంటి అంతరిక్ష కేంద్రాలను  అమెరికా, రష్యా మాత్రమే నిర్వహిస్తున్నాయి. తియాన్ గాంగ్ విజయవంతమైతే చైనా కూడా ఆ రెండు అగ్రరాజ్యాల సరసన చేరుతుంది. 

  • Loading...

More Telugu News