: టీడీపీ, వైఎస్సార్ సీపీలకు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఏది?: టీజీ వెంకటేష్


టీడీపీ, వైఎస్సార్ సీపీలకు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఏదని మంత్రి టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన భేటీ ముగియడంతో మంత్రి మాట్లాడుతూ, ఓ వైపు ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంటే, వీరు మాత్రం మోడీ భజన చేస్తూ, కేంద్రానికి విభజనకు అనుకూల సందేశం పంపుతున్నారని మండిపడ్డారు. 'ఆ రెండు పార్టీల నేతలు హైదరాబాద్ లో చెబుతున్నది ఒకటి, కేంద్రానికి పంపుతున్న సందేశం ఒకటి' అని చంద్రబాబునాయుడు, జగన్ ల వైఖరిని మంత్రి తప్పుపట్టారు. కాసేపట్లో ముఖ్యమంత్రిని కలవబోతున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామని టీజీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News