: సీమాంధ్రలో తీవ్రమైన ఆందోళనలు
కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందన్న సమాచారంతో సీమాంధ్రలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. అనంతపురం జిల్లాలోని కదిరి, తాడిపత్రి, కళ్యాణ దుర్గంలో సమైక్యవాదులు అకస్మాత్తుగా బంద్ కు పిలుపునిచ్చారు. ఎస్కేయూ విద్యార్థులు వందలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనలు మరిన్ని జిల్లాలకు పాకాయి. గుంటూరు జిల్లాలో ఆందోళన వేడెక్కింది. విజయవాడలో ఉద్యమకారులు భారీ ర్యాలీ చేపట్టారు. కాకినాడలో ఉద్యోగులు కేంద్రప్రభుత్వ తీరుపై తీవ్రస్వరంతో మండిపడుతున్నారు.